Tuesday, July 26, 2011

అవాక్కయ్యాను.

మనం తెలుగులో చూసే సినిమాలు చాలా వరకు ఇంగ్లిష్ నుంచి కాపీ కొట్టినవే. హెచ్.బి.ఓ., స్టార్ మూవీస్, మూవీస్ నవ్ చానల్స్ ఇళ్ళలోకి వచ్చిన తర్వాత తెలుగు సినిమాల సరుకేమిటో తెలిసి పోయింది.

ఇటీవల చూసిన కొన్ని సినిమాలను, వాటిలోని చాలా సీన్లను మహామహులనుకొనే దర్శకులు కాపీ కొట్టిన సంగతి చూసి అవాక్కయ్యాను. కొన్ని. మీకు కూడా దొరికితే చెప్పండి. బైలైన్తో చేరుస్తాం.

Mr She . మిస్టర్ పెళ్ళాం. 1993
Mrs Doubt fire 1993 భామనే సత్య భామనే.1996
Father of the bride 1991 ఆకాశమంత 2009
Our Hospitality 1923 మర్యాద రామన్న 2010

Sunday, June 12, 2011

journalists be careful

Mid day journalist JD killed just because of the series of stories he wrote about the weakening of Dawood Gang in India and Pakistan. He just wrote them by taking the information from police officials. D gang wanted to prove that they are still powerfull in Mumbai. There are thousands of Don seenus in Mumbai who want to catch the glimpse of Dawood Bhai. They might have killed JD on the instance of of shakeel. Andhra Journalists becareful.

Sunday, May 29, 2011

సింగపూర్ లోనూ ఐ సి యు లోనే రజని.

రజని కాంత్ ఆరోగ్యం వ్యవహారం ఏదో అనుమానాస్పదంగానే ఉంది. వరుసగా రెండు సార్లు తీవ్రంగా సిక్ అయ్యి ఐ సి యు లో చేరాడు. ఇప్పుడు సింగపూర్ ఆస్పత్రిలోనూ ఐ సి యు లో పెట్టారట. టీవీల్లో చూపించిన ఆయన మొహం తీవ్ర అనారోగ్యంతో భయంకరంగా ఉంది. అంతకు ముందు ఆయన చనిపోయారని ఇంటర్నెట్ కథనాలు కూడా వచ్చాయి. దేవుడు ఆయన అభిమానులకి సంతోషం కలిగించు గాక.

Rajani Kanth, singapore, internet, ICU, Sick,

ఆలోచించారా.

పెట్రోల్ ధరలు మండిపోతున్నాయని ఆందోళన చెందుతున్నాం. భూమి పొరల్లో ఉన్న ముడి చమురు ఎన్ని రోజులు వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా. మహా అయితే మరో ఇరవై ఏళ్ళు. ఆ తర్వాత టాటా, లేలాండ్, హుండై వాహనాలన్నీ తుక్కు కిందే. అమెరికా వాడు తిరిగి వాడుకొనే వీలున్న ఇందనం.. ఉదాహరణకు హైడ్రోజన్, సూర్య రశ్మి... వీటికి సంబందించిన హై ఎండ్ టెక్నాలజీ రూపొందించాడు. మనని పెట్రోల్ డీజిల్ కార్ల వైపు ఎగదోలుతున్నాడు. ఏదో ఒక రోజు ముడి చమురు అయిపోతుంది. మనమంతా హై ఎండ్ టెక్ కోసం మళ్ళి అమెరికా వాడి కాళ్ళ కింద నుంచి దూరి పోవాల్సిందే. అప్పటిదాకా అమెరికాలో మన ఎన్ఆర్ ఐ పిల్లలు ఎక్కాల్లో, స్పెల్లింగుల్లో ఫస్ట్ వస్తే చూసి సంబర పడదాం.

America,crude oil, NRI, cars, Andhra Pradesh, diesel, petrol, tata, leyland, hundai,