Sunday, August 26, 2007

జై మధ్యంతరం జై తెలంగాణా

తెలంగాణాకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానంలో కదలిక మొదలైంది. తెలంగాణా వాదులు ఈ విషయంలో ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్న వామపక్షాలకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అణు వివాదంలో యు.పి.ఎ. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తామని హెచ్చరికలు పంపడం వల్లే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో తన బలాన్ని పదిలం చేసుకోవాలనే స్పౄహలోకి వచ్చింది. అందులో భాగంగానే తెరాస ఎంపీలను తన ఒడిలోకి తెచ్చుకొనే ప్రయత్నం చేస్తోంది. ఈమేరకు పి.సి.సి. అధ్యక్షుడు కె.కేశవరావు ముగ్గురు తెరాస ఎం.పి.లతో బుధవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెరాస ఎం.పి.లను కాంగ్రెస్ లో చేరాలని సూచించారు. సమావేశానికి తెరాస అధినేత కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయి. నరేంద్ర ఇప్పటికే కాంగ్రెస్ ప్రతిపాదనకు ఓకే చెప్పేశారని సమాచారం. తెలంగాణా సాధించకుండా కాంగ్రెస్ ప్రతిపాదనకు ఓకే చెప్పె ప్రసక్తి లేదని తెరాస ఎం.పి.లు స్పష్టం చేశారు. అందుకు కేకే ఒక రాజీ ఫార్ములా సూచించారు. దాని ప్రకారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మరో తీర్మానం చేస్తుంది. రెండో ఎస్.ఆర్.సి.కి బదులు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ రీఆర్గనైగేషన్ కమిషన్ వేయాలని ప్రభుత్వాన్ని కోరుతుంది.(ప్రభుత్వం వేసినప్పుడు సంగతి.) ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిస్థితుల నేపధ్యంలో ఈ సిఫార్సు చేసినట్లు చెబుతారు. లెఫ్ట్ హ్యాండిస్తే మధ్యంతర ఎన్నికల కోసం ఈ ఏర్పాటు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ యూపీయేలో పెద్ద పార్టీగా పెత్తనం చేయడానికి ఆంధ్రాలో వచ్చిన మెజారిటీయే కారణం. ఈ నేపధ్యంలో అదే సంఖ్యలో సీట్లతో ప్రస్తుత మధ్యంతరం గట్టెక్కితే చాలు. తెలంగాణా ఇచ్చే సంగతి వచ్చే ప్రభుత్వం చూసుకుంటుంది. సేం స్టోరీ. ఈ ప్రతిపాదన నచ్చితే తెరాసా కాంగ్రెస్ లో చేరొచ్చు. ఐడెంటిటీ ఉండాలనుకుంటే కాంగ్రెస్ తో పొత్తుతో సొంత కుంపటి కంటిన్యూ చేయవచ్చు. ఈ ఫార్ములాపై ప్రస్తుతం తెరాస మల్లగుల్లాలు పడుతోంది.

2 comments:

CassAmino said...

హాయ్, మీకు వున్న తెలుగు భాషాభిమానానికి జోహార్లు. ఇంటెర్నెట్ లో ఇంత స్వచ్ఛంగా తెలుగును చూస్తుంటే ఆనందంగా వుంది. మీ లాంటి తెలుగు భాషాబిమానులకు ఒక చిన్న ఐడియా ను నేను ప్రారంభించాను. అదే http://www.atuitu.com మిమ్మల్ని ఇక్కడకు ఆహ్వానిస్తున్నాను.

Atuitu is exclusively for Telugu People to help them stay connected and express their voice with some unique tools. I look forward to your contribution on atuitu through active participation and your valuable feedback.

Cheers

Cass

rksistu said...

Hi....
Mee blog chalabagundandi.Meeku Telusa
www.hyperwebenable.com site bloggers ki free ga websites isthunnaru.
ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.